Former Minister Narayana నివాసంలో ఏపీ సీఐడీ దాడులు
ABN , First Publish Date - 2023-02-25T09:20:45+05:30 IST
హైదరాబాద్లో ఏపీ సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిన్న మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో దాడులు నిర్వహించిన అధికారులు నేడు ఆయన నివాసంలోనే దాడులు నిర్వహిస్తున్నారు.
హైదరబాద్ : హైదరాబాద్లో ఏపీ సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిన్న మాజీ మంత్రి నారాయణ (Former Minster Narayana) కుమార్తె నివాసంలో దాడులు నిర్వహించిన అధికారులు నేడు ఆయన నివాసంలోనే దాడులు నిర్వహిస్తున్నారు. సోదాలపై నిన్ననే సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకల పైనే సోదాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం వరకూ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కుటుంబీకుల బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలిస్తున్నారు. అలాగే పలు లావాదేవీల గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం.
నిన్న నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు నారాయణపై ఏపీ సీఐడీ అధికారులు పలు కేసులు పెట్టారు. నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీ (10th class exam paper leakage)తో పాటు, అమరావతి రాజధాని భూముల (Capital lands of Amaravati)కు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో భాగంగా సీఐడీ అధికారులు (CID Officers) పలుమార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా నారాయణ ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఆయన కుమార్తెలను ఏపీ సీఐడీ అధికారులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే నారాయణను ప్రశ్నించడంతో పాటు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న నారాయణ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యప్తు చేస్తున్న సీఐడీ అధికారులు మరోసారి నారాయణ కుమార్తె ఇళ్లల్లో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఏ విషయానికి సంబంధించి నారాయణ కుమార్తె ఇళ్లలో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారనే అంశంపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.