Share News

CM Jagan: పోలీసులూ.. అప్డేట్ అవ్వండి..

ABN , First Publish Date - 2023-10-21T09:14:22+05:30 IST

అసాంఘిక శక్తులు అనే పదాన్ని పునర్నిర్వచించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు.

CM Jagan: పోలీసులూ.. అప్డేట్ అవ్వండి..

విజయవాడ: అసాంఘిక శక్తులు అనే పదాన్ని పునర్నిర్వచించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) అన్నారు. విజయవాడలో నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమాజం కోసం తన ప్రాణాలను బలిపెట్టడానికి సిద్దపడిన యోధుడు పోలీస్ అని కొనియాడారు. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు ఓ బాధ్యత కూడా అని చెప్పుకొచ్చారు. ఈ ఉద్యోగం ఓ సవాల్ అని.. ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న తరుణంలో సైబర్ సెక్యూరిటీ ప్రధానాంశమన్నారు. డేటాథెప్ట్, సైబర్ హెరాస్ మెంట్ వరకూ అన్ని అంశాల్లో దర్యాప్తు చేసి శిక్షవేయాలన్నారు. దీనికి మన పోలీసులు ఎంతో అప్డేట్ కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సైబర్ ప్రపంచంలో నేరగాళ్లు చీకటి ప్రపంచంలో ఉండి సవాళ్లు విసురుతున్నారని.. వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. నేర నిరోధం, నేర దర్యాప్తులో ఏపీ పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే ముందున్నారని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ స్థాయిలో సచివాలయాల్లో నియమించామన్నారు. దిశాయాప్, పోలీస్ స్టేషన్‌లు, పీపీలను నియమించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.


ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజా జీవితాన్ని తమ స్వార్ధం కోసం దెబ్బతీస్తున్న శక్తులు అన్ని అసాంఘిక శక్తులే అని అన్నారు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజాజీవితంపై దాడిచేస్తున్న వారు ఇప్పుడు ఉన్నారని.. ఇలాంటి వారు అడవుల్లోనో అజ్జాతంలోనే కాదు ప్రజా జీవితంలో ఉండి ప్రజలపై దాడిచేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్చ, పౌర హక్కులు అంటే ఒక ముఠా ఒక వర్గం చట్టాన్ని పోలీసులు, న్యాయస్ధానాల నుంచి లాగేసుకొవచ్చు అని కాదన్నారు. నూజివీడులో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను హత్యచేయడం.. అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్షనేత తన కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై దాడి చేయించడం.. పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్రగాయాలు అయ్యేలా చివరకు ఓ పోలసుకు కన్నుపోయేలా చేశారు అంటూ మండిపడ్డారు. అవినీతి చేసి, నేరాలు చేసి ఆపైన ఆదారాలు చూశాక వీరికి అనుకూలంగా న్యాయస్థానాల్లో తీర్పు రాకపోయే సరికి ఆ న్యాయమూర్తులను ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. ఇవి అసాఘిక శక్తులు చేసే పనులే అని.. ప్రజాస్వమ్యంపై నమ్మకం ఉన్న వారు చేసే పనికాదన్నారు. ఇలాంటి దుర్మార్గులపై చట్టం పనిపెట్టాలన్నారు. 1959న చైనా సైన్యానికి వ్యతిరేకంగా కరణ్‌సింగ్ పోరాడారని.. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-21T09:34:01+05:30 IST