CPI: చంద్రబాబు అరెస్ట్‌పై మండిపడ్డ సీపీఐ

ABN , First Publish Date - 2023-09-11T13:04:23+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ నేతలు మండిపడ్డారు. సోమవారం ఉదయం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో దుకాణాలను ఆ పార్టీ నేతలు బంద్ చేయించారు.

CPI: చంద్రబాబు అరెస్ట్‌పై మండిపడ్డ సీపీఐ

అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Arrest) అరెస్ట్‌పై సీపీఐ నేతలు (CPI Leaders) మండిపడ్డారు. సోమవారం ఉదయం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో దుకాణాలను ఆ పార్టీ నేతలు బంద్ చేయించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ... ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే జైలుకు తరలించాలని చూస్తున్నారన్నారు. జగన్ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీని కూడా హింసించి రాష్ట్రానికి రాకుండా చేస్తున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు, మార్గదర్శిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తల, తోక లేని కేసుకు బాబుని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సీఐడీని వైసీపీ ప్రైవేట్ సైన్యంగా మార్చుకున్నారన్నారు. వారికి చట్టాలు లేవు, ఎవరిని అరెస్ట్ చేయమంటే వారిపై జైల్లో పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేపు లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేస్తామంటారని... వారిని భౌతికంగా లేకుండా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతని ఎదుర్కువడానికి అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇండియా కూటమి లోకి రావాలని జగదీష్ కోరారు.

Updated Date - 2023-09-11T13:04:23+05:30 IST