CPI Ramakrishna: అర్థరాత్రి హంగామా సృష్టించాల్సిన అవసరమేంటి?
ABN , First Publish Date - 2023-09-09T09:30:46+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చని.. కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) తీవ్రంగా ఖండించారు. ఏదైనా ఉంటే పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టవచ్చని.. కాని పోలీసులు అర్ధరాత్రి వెళ్లి హంగామా సృష్టించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. లోకేశ్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను నిర్బంధించటం దుర్మార్గమన్నారు. మార్గదర్శిపై సీఐడీ దుందుడుకుగా వ్యవహరిస్తోందన్నారు. జగన్ సర్కార్ (Jagan Government) ప్రతిపక్షాలను వేధించటానికి ఇది పరాకాష్ట అంటూ రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.