CPI: బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-08T17:06:26+05:30 IST

సీపీఐ (CPI) బస్సు యాత్ర ముగింపు సభలో సీపీఐ నేత నారాయణ (Narayana) మాట్లాడుతూ బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI: బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు

తిరుపతి: సీపీఐ (CPI) బస్సు యాత్ర ముగింపు సభలో సీపీఐ నేత నారాయణ (Narayana) మాట్లాడుతూ బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


"తిరుమలలో మద్యం తాగ కూడదు. మద్యం కేసుల్లో నిందితులు టీటీడీ పాలక మండలిలో ఉండవచ్చా?. వీళ్ళా టీటీడీ పవిత్రతను కాపాడేది?. తిరుమల దేవుడిని వీళ్ళ నుంచి కాపాడు కోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. ప్రధాని అవినీతి పరుడు. అందుకే 29 మంది అవినీతి పరులైన దత్త పుత్రులకు కాపాడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అని సమాచారం వస్తోంది. చంద్రబాబు ను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే 60 వేల కోట్లు దోచుకుని, బైల్ లో ఉన్నవాడు హోల్ సేల్ గా ఉన్నపుడు చిన్న చిన్న అభియోగాలు ఉన్న వాళ్ళు ఉండకూడదు కదా. G20 సమావేశంను బీజేపీ జాతీయ సమావేశం లాగా బీజేపీ కమలం గుర్తు పెట్టుకునీ నిర్వహిస్తున్నారు. బీజేపీ, ఈడీలను పెంపుడు కుక్కలను చేసుకున్నారు. చంద్రయాన్ కూడా బీజేపీ ప్రచారానికి వాడుకుంటున్నారు. కేసీఆర్, జగన్, బీజేపీలను ఓడించాలి." సీపీఐ నారాయణ ప్రజలకు పిలుపినిచ్చారు.

Updated Date - 2023-09-08T17:11:48+05:30 IST