CPI Ramakrishna : మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలే..

ABN , First Publish Date - 2023-10-12T09:24:57+05:30 IST

గత నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలేనన్నారు.

CPI Ramakrishna : మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలే..

అమరావతి : గత నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలేనన్నారు. గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.115 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ చేసిన అప్పు రూ.8 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. జగన్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి ఆరుసార్లు రూ.67 వేల కోట్లు అప్పు చేసిందని రామకృష్ణ అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి ఏపీలో లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు ప్రజలపై గుదిబండగా మారాయని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2023-10-12T09:24:57+05:30 IST