CWC: కృష్ణా జలాల వివాదంపై ఏపీ, తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ నోటీసు
ABN , First Publish Date - 2023-12-01T21:00:10+05:30 IST
శనివారం ఉదయం 11.00 గంటలకు కృష్ణా జలాల వివాదంపై కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమావేశానికి రావాలని కేంద్ర జలశక్తి శాఖ నోటీసు పంపించింది.
అమరావతి: శనివారం ఉదయం 11.00 గంటలకు కృష్ణా జలాల వివాదంపై కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమావేశానికి రావాలని కేంద్ర జలశక్తి శాఖ నోటీసు పంపించింది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడమే అజెండాగా కేంద్ర జలశక్తి శాఖ పెట్టుకుంది. అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలపై కూడా సమావేశంలో చర్చించనుంది. న్యూఢిల్లీలోని జలశక్తి శాఖ కార్యాలయంలో రూమ్ నెంబర్ 412లో ఈ భేటీ జరగనుంది. జలశక్తి శాఖలో జలవనరుల విభాగం కార్యదర్శి నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల అధికారులు సమావేశం కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రా చీఫ్ సెక్రటరీలతో పాటు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్, కేఆర్ఎంబీ చైర్మన్‌లను హాజరుకావాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది.