Devineni Uma: చంద్రబాబుపై కుట్ర.. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-10-27T20:27:37+05:30 IST
గొల్లపూడిలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై (YCP) విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ జిల్లా: గొల్లపూడిలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై (YCP) విమర్శలు గుప్పించారు.
"చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో వైసీపీ వైఖరితో ఆందోళన కలుగుతోంది. చంద్రబాబును అంతమొందించే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల, కొంత మంది అధికారులు కుట్రకు తెరలేపారు. బాధ్యతారాహిత్యంగా దీనిపై ఎంపీ హిందూపూర్ మీడియాలో మాట్లాడారు. బాధ్యతగల పార్లమెంట్ హిందూపూర్ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల, ఎంపీ మిధున్ రెడ్డి ఏం సమాధానం?. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి. జైలుపై డ్రోన్లు ఎగరేసి.. పెన్ కెమేరాలతో వీడియోలు తీసి మీడియాకి, సాక్షికి వార్తలు వస్తున్నాయి. జైలు శాఖ సిబ్బందితో చంద్రబాబునాయుడు ఉత్తరం ద్వారా తెలియజేస్తే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. న్యాయస్థానంలో వాయిదాలపై వాయిదాలు పడుతున్నాయి. న్యాయం ఆలస్యం అవుతోంది. హెల్త్ రిపోర్టును డాక్టర్లే వెల్లడి చేయాలని... కానీ చంద్రబాబు విషయంలో జైలు అధికారులే హెల్త్ రిపోర్టులు ఇస్తున్నారు..రాష్ట్రంలో పరిపాలనను గాలికివదిలేశారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేయడం చేతకాదు.. పంటలు నాశనమైపోతున్నాయి. వ్యవస్థలన్నీ సతికిలపడ్డాయి. చంద్రబాబుని భద్రతలేని జైల్లో పెట్టారు. అక్కడ సంఘవిద్రోహ శక్తులు, గంజాయి బ్యాచ్ ఉన్నారు. కొట్టుకొని ఖైదీలు చనిపోయిన వార్తలు కూడా వస్తున్నాయి. 19ఏళ్ళ యువకుడు వీరవెంకట సత్యన్నారాయణ డెంగ్యూ ఫీవర్ తో చనిపోయాడు." అని దేవినేని ఉమ గుర్తు చేశారు.