Home » Devineni Umamaheswara Rao
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేలా టీడీపీలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన విధానాన్నే సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. టీడీపీ ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ పెద్దల సభలో ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు.
మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం..
వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుడమేరు పాపం గత ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘బుడమేరు గేట్లు ఎత్తేశారా..?’’ అని జగన్ అంటున్నారని... సీఎంగా.. ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హామీ ఇచ్చారు.
Andhrapradesh: ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ పేరుతో గత ప్రభుత్వ పెద్దలు చేసిన భూదందాలపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... లక్షలాది ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, చుక్కల భూములు కొల్లగొట్టారని మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్కు మీడియా ముందు మాట్లాడే ధైర్యం లేదని, అందుకే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో బ్లూ మీడియాకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS)లో ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి బాయిలర్ నుంచి మంటలు(Boiler Explosion) చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (Minister Vasamshetty Subhash), మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma) పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి.
సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Umamaheswara Rao) తెలిపారు. వైఎస్ జగన్ రెడ్డి పులివెందులలో పెడబొబ్బలు పెడుతున్నాడని విమర్శించారు.
కోట్ల రూపాయల ఫర్నిచర్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకోవడం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తోంది. విపక్ష నేతలు దీనిపై విరుచుకు పడుతున్నారు. ఇంట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను వేధించిన కర్మఫలం మాజీ సీఎం జగన్ రెడ్డిని వెంటాడుతోందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.