Ap News: తడిసిన ధాన్యం కొనాలని ఉమా రాస్తారోకో
ABN , First Publish Date - 2023-05-03T21:39:59+05:30 IST
తడిసిన, రంగు మారిన ధాన్యం కొనాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఇబ్రహీంపట్నం - చత్తీష్‌గడ్ (30).వ నంబరు జాతీయ రహదారిపై..
మైలవరం: తడిసిన, రంగు మారిన ధాన్యం కొనాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఇబ్రహీంపట్నం - చత్తీష్‌గడ్ (30).వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం బైఠాయించారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఉమాను పోలీస్‌స్టేషన్ (Police Station)కు తరలించకుండా అడ్డుపడటంతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ రైతులు పెళ్లాం పుస్తెలు తాకట్టు పెట్టి అప్పు చేసి పంట పండించారని, ధర లేక సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతుల కంట నీరు కాదు రక్తం వస్తుందన్నారు. ఆరుకాలం పండించిన పంటను కాపాడుకునేందుకు మార్కెట్ యార్డ్‌కు తీసుకువస్తే షెడ్‌లో ఇనుము దాచి, ధాన్యంను వర్షంలో పెట్టిన ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ధాన్యం, మొక్కజొన్నలను కాపాడుకునేందుకు టార్ఫాలిన్ పట్టాలు ఇవ్వలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి, సీఎం జగన్ రైతుల పరిస్థితిని ఎందుకు పట్టించుకోరని దేవినేని ఉమా ప్రశ్నించారు.