Devineni Uma: పవన్ కళ్యాణ్ చరిత్రత్మాక నిర్ణయం తీసుకున్నారు

ABN , First Publish Date - 2023-09-14T19:14:00+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌ను ఖండిస్తూ మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో రెండోవ రోజు టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.

Devineni Uma: పవన్ కళ్యాణ్ చరిత్రత్మాక నిర్ణయం తీసుకున్నారు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌ను ఖండిస్తూ మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో రెండోవ రోజు టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షల శిబిరాలను సందర్శించి మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) సంఘీభావం తెలిపారు. టీడీపీ, జనసేన పొత్తుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు.


"పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్నది చరిత్రత్మాక నిర్ణయం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబునాయుడుపై తప్పుడు కేసులు పెట్టి, బురదజల్లి రాజమండ్రి జైల్లో పెట్టి జగన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. సైకో జగన్‌ను, సైకో ప్రభుత్వంను జనసేన, టీడీపీ పార్టీలు సమిష్టిగా పనిచేసి బంగాళాఖతంలో కలపాలి. టీడీపీ నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి టీడీపీ నాయకులకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. జనసేన నాయకులతో కలిసి దేవినేని ఉమా నినాదాలు చేశారు.

Updated Date - 2023-09-14T19:14:30+05:30 IST