Rajahmundry: చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రహ్మణి, పయ్యావుల
ABN , First Publish Date - 2023-10-10T16:54:38+05:30 IST
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, బ్రహ్మణి కలిసారు. వారితో పాటు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ పయ్యావుల కేశవ్ ఉన్నారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu)ను మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari), బ్రహ్మణి (Brahmani) కలిసారు. వారితో పాటు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి స్నేహా బ్లాక్‌లో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. జైల్లో చంద్రబాబు ఆరోగ్యం, సదుపాయాలు, భద్రత గురించి వారు అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో సీఐడీ (CID) విచారణకు నారా లోకేష్ (Nara Lokesh) మంగళవారం హాజరయ్యారు. నిర్ణయించిన సమయం కంటే ఐదు నిముషాలు ముందే సిట్ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో లోకేష్‌ను ఏ14గా చేర్చారు. కాగా ఈ కేసులో లోకేష్‌కు ముందస్తు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టు ముందుకు వచ్చి ఈ కేసులో లోకేష్‌కు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని, అరెస్టు చేయబోమని చెప్పారు.
ఇంకోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు (Supreme Court)లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ జరుగుతుందని కోర్ట్ వెల్లడించింది. కాగా మంగళవారం ఇరుపక్షాల న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.