Rajahmundry: చంద్ర‌బాబుతో లోకేష్, భువ‌నేశ్వ‌రి, బ్రహ్మాణి ములాఖ‌త్

ABN , First Publish Date - 2023-10-06T15:51:39+05:30 IST

రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి శుక్రవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. సుమారు 45 నిముషాలపాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు.

Rajahmundry: చంద్ర‌బాబుతో లోకేష్, భువ‌నేశ్వ‌రి, బ్రహ్మాణి ములాఖ‌త్

రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో అరస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)తో ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari), కుమారుడు లోకేష్ (Lokesh), కోడలు బ్రహ్మణి (Brahmani) శుక్రవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. సుమారు 45 నిముషాలపాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం, భద్రత అక్కడ సౌకర్యాల గురించి కుటుంబసభ్యులు అడిగి తెలుసుకుంటున్నారు.

కాగా నిన్న ఢిల్లీ నుంచి నారా లోకేష్ విజయవాడకు వచ్చారు. ఈరోజు విజయవాడ నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చారు. ఢిల్లీ, ఏపీలో రాజకీయ పరిణామాలపై ఆయన చంద్రబాబుతో చర్చించే అవకాశముంది. అనంతరం జనసేన (Janasena), టీడీపీ (TDP) పొత్తు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 28 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

మరోవైపు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంపై తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు, ఎన్నారైలు, టీడీపీ అభిమానులు సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాబుతో నేను.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు రోజు రోజుకు ఉదృతమవుతున్నాయి. ఏ తప్పు చేయని తమ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో గత 25వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-10-06T15:51:39+05:30 IST