Atchannaidu: ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు..

ABN , First Publish Date - 2023-05-12T11:05:24+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ 2023 మహానాడు ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు.

Atchannaidu: ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు..

తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ 2023 మహానాడు (Mahanadu) ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla), నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa), ఆదిరెడ్డి భవానీ (Adireddy Bhavani), మాజీ మంత్రులు జవహర్ (Jawahar), కొల్లు రవీంద్ర (Kollu Ravindra), దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma), అయ్యన్నపాత్రుడు (Ayyanna Pathrudu), గొల్లపల్లి సూర్యారావు (Gollapalli Suryarao), టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు రాజమండ్రిలో అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ఈ మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించటం వల్ల ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. 27న రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు 1500 మంది ప్రతినిధులుతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 15న తీర్మానాలు చేస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

నాలుగున్నరళ్ళ వైసీపీ పాలన దుర్మార్గంపై ప్రత్యేక తీర్మానం ఉంటుందని, 28న 15 లక్షల మంది హాజరవుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు విజయవంతం కోసం 15 కమిటీలు ఏర్పాటుచేసుకున్నామన్నారు. దీనికి పోలీస్ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఈ నెలఖారు వరకు టీడీపీకు హోర్డింగ్‌లు ఇవ్వకూడదని బెదిరిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ... జగన్‌ను ఇంటికి పంపాలని జనం అంతా ఎదురుచూస్తున్నారన్నారు. హత్య నిందితులను కూడా అరెస్ట్ చేయకుండా జగన్ ఢిల్లీలో పెద్దల కాళ్ళు పట్టుకుంటున్నారని ఆరోపించారు. మహానాడు వేదికగా జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపిచ్చారు.

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మహానాడుకు వచ్చే లక్షలాది మందికి ఆతిథ్యం ఇచ్చేందుకు టీడీపీ స్థానిక నేతలు, ప్రభుత్వ పెద్దలు సహకరించాలని కోరారు.

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ... మహానాడు ఒక పండుగ కాబట్టి అందరూ స్వచ్ఛందంగా హాజరుకావాలని పిలుపిచ్చారు. ప్రజలంతా జగన్ పోవాలి.. చంద్రబాబు రావాలనుకుంటున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జగన్‌ను ఓడించాలనుకుంటున్నారని అన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. భవిష్యత్తు రాజకీయాలకు మహానాడు వేదిక కాబోతుందన్నారు.

Updated Date - 2023-05-12T11:05:24+05:30 IST