Gorantla: సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో భారీ కుట్ర
ABN , First Publish Date - 2023-10-16T14:46:19+05:30 IST
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు, వైద్యులు సక్రమమైన విధానంలో హెల్త్ బులిటెన్ విడుదల చేయటం లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు (Jail Officers), వైద్యులు (Doctors) సక్రమమైన విధానంలో హెల్త్ బులిటెన్ (Health Bulletin) విడుదల చేయటం లేదని టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader), ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Buchaiah Choudary) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) సారథ్యంలో భారీ కుట్ర జరుగుతోందని, చంద్రబాబు ప్రాణాలకే ముప్పు తెచ్చే కార్యక్రమం నడుస్తోందని అనుమానిస్తున్నామన్నారు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందన్నారు. వైసీపీ నేతలు మనుషులా? పశువులా? వారిని పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలన్నారు. చంద్రబాబుపై కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. హెల్త్ బులిటెన్‌లో పూర్తి వివరాలు కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబుని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని, బాబుకు ప్రపంచ వ్యాప్తంగా సంఘీబావం పెరగటంతో తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోందని బుచ్చయ్య చౌదరి అన్నారు. జైలులో డ్రోన్ కెమెరా (Drone Camera) ఎందుకు ఎగిరిందని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Govt.) భర్త్ రప్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, సజ్జల రామకృష్ణా రెడ్డిలు తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. బాబాయ్ హత్య కోసం ఢిల్లీ చుట్టూ, కేంద్రం చుట్టూ తిరిగింది ఎవరన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తామని చెప్పే దమ్ము, దైర్యం సీఎం జగన్ (CM Jagan)కు లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.