Chinarajappa: చంద్రబాబును జైల్లో పెట్టి.. రాష్ట్రమంతా తిరగాలన్నదే జగన్ ప్లాన్

ABN , First Publish Date - 2023-10-12T13:20:05+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టి తాను రాష్ట్రమంతా తిరగాలని జగన్ చూస్తున్నారని.. అందుకోసమే ఈరోజు జగన్ సామర్లకోట వచ్చారని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు.

Chinarajappa: చంద్రబాబును జైల్లో పెట్టి.. రాష్ట్రమంతా తిరగాలన్నదే జగన్ ప్లాన్

రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) జైల్లో పెట్టి తాను రాష్ట్రమంతా తిరగాలని జగన్ (CM Jagan) చూస్తున్నారని.. అందుకోసమే ఈరోజు జగన్ సామర్లకోట వచ్చారని ఎమ్మెల్యే చినరాజప్ప (MLA Chinarajappa) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు కానీ ప్రారంభోత్సవం చేస్తున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు తనను పిలవడం లేదని... ఖచ్చితంగా ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనే అని అన్నారు. జనాలను తీసుకురావాలని ఉద్యోగస్తులకు టార్గెట్లు ఇస్తున్నారన్నారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వసుందని ధీమా వ్యక్తం చేశారు. సజ్జల సాక్షిలో ఓ గుమస్తా అని.. అన్ని శాఖలకు ఆయనే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ నుంచీ అన్నీ తప్పుడు కథనాలు చెబుతున్నారని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-12T14:59:03+05:30 IST