Viveka Case: వివేకా హత్య, కోడికత్తి కేసుల్లో వాస్తవాలు తెలిసిపోయాయి: ఆదినారాయణరెడ్డి
ABN , First Publish Date - 2023-04-30T20:16:23+05:30 IST
మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య, కోడికత్తి ఘటనల్లో వాస్తవాలు బయటకు రావడంతో ఎవరు నిందితులో
జమ్మలమడుగు: మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య, కోడికత్తి ఘటనల్లో వాస్తవాలు బయటకు రావడంతో ఎవరు నిందితులో అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) విమర్శించారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆదినారాయణరెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన్‌కీబాత్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆదినారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో బడ్జెట్ ఉన్నా రాష్ట్రాన్ని సీఎం జగన్ (CM Jagan) అభివృద్ధి చేయకుండా ఆయన బడ్జెట్ నింపుకుంటున్నారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ కోతల రాయుడని ఎద్దేవాచేశారు. విద్యుత్తు కోతలు, కరెంటు బిల్లులు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీల (BJP Janasena TDP)ను కలిపే బాధ్యత తమదేన్నారు. మనషులను చంపి మరొకరిపై నేరం మోపడం వైసీపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో జగన్ కోడికత్తి కేసు ఒక డ్రామా అని ఎన్‌ఐఏ తేల్చి చెప్పిందన్నారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) 2019 మార్చి 15న ఉదయం 6 గంటలకు జమ్మలమడుగుకు వస్తుంటే చిన్నాయన చనిపోయాడని బైపాస్ రోడ్డులో ఉన్న తనకు ఫోన్ రాగా తిరిగి పులివెందులకు పోయానని అబద్ధాలు చెప్పాడని, ఆయనకు అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని తప్పుబట్టారు. జగన్ తనకు ఆస్తులు లేవు, పేపర్ లేదు, టీవీ లేదు, కనీసం ఇంటిలో బువ్వ కూడా లేదు అని చెబుతున్నారని.. మరి ఇద్దరి కూతుర్లకు పెళ్లిళ్లు ఎలా చేస్తాడని ఎద్దేవా చేశారు. పేదరికం మాటలు చెప్పడం వెనుక సంపాదించిన లక్షల కోట్లు ప్రజలకందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో జగన్‌కు భారతి సిమెంటు ఫ్యాక్టరీ, ఆరుచోట్ల ఇళ్లు, కోట్లలో విలువ చేసే భూములు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మోదీ రోడ్లలో గంటకు 150 కి.మీ. వేగంతో పోవచ్చని, అదే కేడీ రోడ్లు చూస్తే గంటకు 10 కి.మీ. కూడా వేగంతో పోలేమని, గర్భవతులు రోడ్లపైనే కాన్పులు అవుతారని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు.