Share News

Kollu Ravindra: చర్చకు రాకుండా తోకముడిచారు.. సిదిరి అప్పలరాజుపై కొల్లురవీంద్ర ఫైర్

ABN , Publish Date - Dec 27 , 2023 | 12:01 PM

Andhrapradesh: మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన సవాల్‌కు స్పందిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ మంత్రి స్పష్టం చేశారు.

Kollu Ravindra: చర్చకు రాకుండా తోకముడిచారు.. సిదిరి అప్పలరాజుపై కొల్లురవీంద్ర ఫైర్

విజయవాడ: మంత్రి సిదిరి అప్పలరాజు (Minister Sidiri Appalraju) చేసిన సవాల్‌కు స్పందిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) బుధవారం ఉదయం ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ మంత్రి స్పష్టం చేశారు. అయితే చెప్పిన విధంగా రాలేక సిదిరి అప్పలరాజు తోక ముడిచారని కొల్లురవీంద్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రపై విమర్శలు చేస్తూ సిదిరి అప్పలరాజు బహిరంగ లేఖ రాశారని.. బహిరంగ చర్చకు సిద్దమని తాము సవాల్‌ను స్వీకరించామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్దకు ఈరోజు 11 గంటలకు రావాలని చెప్పామన్నారు. చర్చకు రాకుండా తోక ముడిచిన తమరా లోకేష్ గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు.


‘‘మీ నాయకుడు మార్నింగ్, ఈవ్‌నింగ్ వాక్ చేశాడు. శుక్రవారం నుంచి మూడు రోజులు రెస్ట్‌లో ఉన్నాడు. మా లోకేష్ ఎండ, వాన లెక్క చేయకుండా పాదయాత్ర పూర్తి చేశాడు. తండ్రి అక్రమ అరెస్టు అయితే యాత్రను ఆపి వెళ్లడం తప్పా. మీ నాయకుడి నాన్న చనిపోతే.. సంతకాల సేకరణ చేయించిన చరిత్ర. బీసీలను అన్ని విధాలా అణగ దొక్కిన చరిత్ర మీ జగన్ ది. వారికి అందాల్సిన పధకాలు, నిధులు నిలిపేశారు. మీ సీట్ల కోసం లోకేష్‌పై నోరు పారేసుకుంటారా?. ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చకు రండి. నీ సీట్లు కోసం బిసి లను అడ్డు పెట్టుకుంటావా... సిగ్గేస్తుంది. చేతి వృత్తుల వారికి జీవనోపాధి లేకుండా చేశారు. మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రండి... లేదంటే నోరు మూసుకోండి. ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి?.. జగన్ దోచుకోవడానికి ఇదొక కొత్త డ్రామా. స్టేడియంల అభివృద్ధి లేదు.. క్రీడాకారులు ప్రోత్సాహం లేదు. సిదిరి అప్పలరాజు నోరు అదుపులో పెట్టుకో. చర్చకు రాకుండా పారిపోయిన నువ్వు ఇంకోసారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వం’’ అంటూ కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Updated Date - Dec 27 , 2023 | 04:18 PM