Perninani: ఏపీ అసెంబ్లీ సాక్షిగా అమరావతి చుట్టూ కథ అల్లిన పేర్నినాని

ABN , First Publish Date - 2023-09-27T15:23:11+05:30 IST

ఇన్నర్ రింగ్ రోడ్డులో మార్పులపై శాసనసభలో మాజీ మంత్రి పేర్నినాని స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమరావతి చరిత్ర అంతా అవినీతి కథే అని అన్నారు. దీనిలో చంద్రబాబు, నారాలోకేష్, నారాయణలు ఉన్నారు అంటూ ఆధారాలు లేని ఆరోపణ చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక రాజధాని నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వద్ద అని మభ్యపెట్టారని.. 2014 నుంచి 2019 మార్చి, ఏప్రిల్ మధ్య అమరావతి అవినీతి కథలు కొనసాగాయని తెలిపారు.

Perninani: ఏపీ అసెంబ్లీ సాక్షిగా అమరావతి చుట్టూ కథ అల్లిన పేర్నినాని

అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డులో మార్పులపై శాసనసభలో మాజీ మంత్రి పేర్నినాని (Former Minister Perni nani) స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమరావతి చరిత్ర అంతా అవినీతి కథే అని అన్నారు. దీనిలో చంద్రబాబు, నారాలోకేష్, నారాయణలు ఉన్నారు అంటూ ఆధారాలు లేని ఆరోపణ చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక రాజధాని నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వద్ద అని మభ్యపెట్టారని.. 2014 నుంచి 2019 మార్చి, ఏప్రిల్ మధ్య అమరావతి అవినీతి కథలు కొనసాగాయని తెలిపారు. దీనిలో దొరికిపోతే చంద్రబాబు మాత్రం నిర్ణయాలు అన్ని క్యాబినెట్ సమిష్టి నిర్ణయం అంటారన్నారు. మాస్టర్ ప్లాన్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుందన్నారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ఎవరు బాగుపడాలో వారు నిర్ణయించాంటూ మంత్రి ఊహాజనిత వ్యాఖ్యలు చేశారు. ఎస్టీయూపీ చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు సంస్ధకు ఇన్నర్ రింగ్ రోడ్డు తయారు చేయమని ఇచ్చారన్నారు. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డును నిడమర్రు వద్ద నుంచి కంతేరు, ఖాజా వరకూ సాగదీసారన్నారు. ఎలైన్మెంట్ మార్చిన ప్రాంతాల్లో లింగమనేని రమేష్, హెరిటేజ్ కంపెనీ పోలాల్లో నుంచి వెళ్లిందని తెలిపారు. రామకృష్ణ టౌన్ షిప్ పక్క నుంచి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పడిందన్నారు. హెరిటేజ్ కంపెనీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకొని 15 ఎకరాలు ఉన్నాయని అన్నారు. తాడిగడప వద్ద నుంచి వెళ్లిన రోడ్ అక్కడి నుంచి పెనమలూరు, నిడమానూరుకు మార్చారన్నారు. అక్కడ మంత్రి నారాయణకు చెందిన 10 కాలేజీలు ఉన్నాయని మంత్రి ఆరోపించారు.


‘‘ఏ 14గా ఉన్న వ్యక్తి లోకేశ్‌, ఐఆర్‌ఆర్‌కు తమకు ఏం సంబంధమని అంటున్నారు. లోకేశ్, భువనేశ్వరి కలిసి హెరిటేజ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ మీటింగ్‌లో అమరావతిలో భూములు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. నారా భువనేశ్వరి తనకున్న షేర్లలో 2 శాతం అమ్మితే రూ.370 కోట్లు వస్తాయి అంటున్నారు. మీకు అంత సంపద ఉంటే అమరావతి నిర్ణయానికి ముందే భూములు కొనాలని ఎలా తీర్మానించారు’’ అంటూ సంబంధం లేని ప్రశ్నవేశారు. ఐఆర్ఆర్ రోడ్డును తిప్పినందుకు లింగమనేని రమేష్ హెరిటేజ్‌కు భూములుతో పాటు, కరకట్ట ఇల్లు ఇచ్చారంటూ ఆరోపించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రాజధాని ఏర్పాటుకు జీవో ఇచ్చారన్నారు. అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం లాక్కుంటుంది అని ప్రచారం చేశారన్నారు. మంత్రి నారాయణ ఆయన బంధువులు దళితుల వద్ద 148 ఎకరాలు రాయించుకున్నారని తెలిపారు. అప్పటి గుంటూరు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు చట్టాలను వివరించినా నారాయణ ఒప్పుకోలేదన్నారు. అసైన్డ్ భూముల, నిషేధిత భూములలో పూలింగ్ తీసుకుని వారికి ప్లాట్‌లు కేటాయించి భూములు తీసుకోవాలని సూచించారన్నారు. సీడ్ క్యాపిటల్‌ను ఆనుకొని నారాయణ కుటుంబ సభ్యులు 76 వేల గజాలు పొందారన్నారు.1977 అసెన్మెంట్ భూముల చట్టాన్ని ఇక్కడ పూర్తిస్థాయిలో ఉల్లంఘించారన్నారు. ఇలాంటివి చేసిన వారిని శిక్షించాలా వద్దా చెప్పండి అంటూ పేర్నినాని అమరావతి చుట్టూ కథ అల్లే ప్రయత్నం చేశారు.

Updated Date - 2023-09-27T15:23:11+05:30 IST