Gadde Rammohan : వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది

ABN , First Publish Date - 2023-06-10T11:59:00+05:30 IST

కరెంట్ అందరికీ నిత్య అవసరంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తెలుగుదేశం తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మెరుగు పడిందన్నారు. తెలుగుదేశం నాలుగు ఏళ్ళ హయాంలో ఎప్పుడు విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగు ఏళ్ళ కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని గద్దె రామ్మోహన్ అన్నారు.

Gadde Rammohan : వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది

విజయవాడ : కరెంట్ అందరికీ నిత్య అవసరంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తెలుగుదేశం తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మెరుగు పడిందన్నారు. తెలుగుదేశం నాలుగు ఏళ్ళ హయాంలో ఎప్పుడు విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగు ఏళ్ళ కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని గద్దె రామ్మోహన్ అన్నారు. తెలుగుదేశం అధికారంలో వచ్చిన మరుక్షణమే 2014 -19 లో ఉన్న విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం సైతం 2019 ముందు ఏ ఏ బ్రాండ్లు ఉన్నాయో వాటినే తీసుకువస్తామని.. అదే రేట్‌కు విక్రయిస్తామని గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో సోలార్ విద్యుత్‌ను యూనిట్ 6 రూపాయలకు కొనగోలు చేస్తే ఇప్పుడు రూ.20కి కొనగోలు చేస్తున్నారన్నారన్నారు. సామాన్యుల గురించి ఉన్నత వర్గాల వరకు విద్యుత్ చార్జీల భారం పడుతోందన్నారు. కరెంటు బిల్లులపై జగన్ బొమ్మతో ఇస్తే మరింత బాగుండేదన్నారు. సర్వేలు అని కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మరో 10 నెలలు వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని గద్దె రామ్మోహన్ అన్నారు.

Updated Date - 2023-06-10T11:59:00+05:30 IST