Home » Gadde Rama Mohan
MP Kesineni: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందు వెళ్లారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
Andhrapradesh: ‘‘మన రాష్ట్రం వెనకపడి ఉంది కానీ.. మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారు. విజన్ 2020 అంటే నవ్వారు.. కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి’’ అని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని.. ఒకటి హైదరాబాద్, అమరావతి అని తెలిపారు.
Andhrapradesh: ‘‘నా చిన్నప్పుడు చాలా మంది బ్యాంకులకు వెళ్లాలన్నా భయపడే వారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’ అని రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి నేరుగా తమ అభిప్రాయాలు చెబుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రభుత్వ అధికారులు..
Andhrapradesh: తూర్పు నియోజకవర్గం పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు.
విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పండుగను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. వరలక్ష్మీ నగర్, నాగార్జున నగర్, పోలీస్ కాలనీల్లో పేదలకు స్వయంగా గద్దె రామ్మోహన్ పెన్షన్ అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ పెన్షన్ తొలగించారని ఎమ్మెల్యేకు పలువురు వృద్దులు తెలిపారు. ఆగస్ట్‌లో అర్హత ఉన్న వారికి పెన్షన్ లు మంజూరు చేసేలా చూస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో నలుగురు ప్రధాన పార్టీ అభ్యర్థులు కాగా.. మిగతా వారు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు. బ్యాలెట్లో మొత్తం 16 క్రమ సంఖ్యలు ఉండగా.. మొదటి1 5 అభ్యర్థులకు సంబంధించినవి, 16వ క్రమసంఖ్య నోటాను సూచిస్తుంది.
Andhrapradesh: నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: విజయవాడ తూర్పు నియోజకవర్గం భారతీనగర్‌లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ దారుల ప్రాణాలు పోయినా ... జగన్‌కు రాజకీయ లబ్ది ముఖ్యమని మండిపడ్డారు. నెల క్రితమే కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వలేదన్నారు. మానవత్వం లేకుండా వృద్ధులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబుపై నింద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.