Ganta Srinivasa Rao: వైసీపీ ప్రభుత్వానికి ‘గంటా’ 20 ప్రశ్నలు

ABN , First Publish Date - 2023-03-02T21:42:47+05:30 IST

కనీసం రాజధానిని కూడా నిర్మించుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారో చెప్పగలరా?...

Ganta Srinivasa Rao: వైసీపీ ప్రభుత్వానికి ‘గంటా’ 20 ప్రశ్నలు

విశాఖపట్నం: కనీసం రాజధానిని కూడా నిర్మించుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారో చెప్పగలరా?... అంటూ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) గురువారం ప్రభుత్వానికి ఒక లేఖ (letter) రాశారు. విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నందున ప్రజలకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటికి సమాధానం ఇవ్వాలంటూ 20 ప్రశ్నలు సంధించారు.

ప్రశ్నలివే..

దావోస్‌లో పెట్టుబడుల సదస్సుకు వెళ్లకపోవడానికి సరైన కారణాలు చెప్పగలరా?, ప్రతిష్ఠ దెబ్బతిన్నదని ఇప్పటికైనా గుర్తించారా?

అండర్‌వేర్లు తయారుచేసే జాకీ కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లపోయినందున అలాంటి తప్పులు పునరావృతం కావని హామీ ఇచ్చారా?

కియా కంపెనీ అనుబంధ సంస్థలు ఒక్కటి కూడా తీసుకురాలేకపోయినందుకు ఆత్మపరిశీలన చేసుకున్నారా?

హెచ్‌ఎస్‌బీసీ విశాఖ నుంచి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేశారా?

అమర్‌రాజాను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాబోమని సదస్సులో చెప్పగలరా?

భోగాపురం విమానాశ్రయానికి నాలుగేళ్లు శంకుస్థాపన చేయకుండా ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారు?

సదస్సుకు 25 చార్టర్డ్‌ విమానాలు వస్తుంటే పార్కింగ్‌ సదుపాయం లేదని చెబుతున్నారు. భోగాపురంలో విమానాశ్రయం నిర్మించి వుంటే ఈ సమస్య వచ్చేదా?

నాలుగేళ్లలో కొత్తగా ఒక్క పోర్టు అయినా అభివృద్ధి చేశారా?

పారిశ్రామికవేత్తలలో ఎలాంటి విశ్వాసం కలిగించకుండా సదస్సు ఏర్పాటు చేయడంలో మీ నమ్మకం ఏమిటి?

విశాఖలో 2019లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 50 వేలు ఉంటే ఇప్పుడు 30 వేలకు ఎందుకు పడిపోయింది?

అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అయినా అదనపు భూమి కేటాయించడంలో రహస్యం ఏమిటి?

ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా?

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఫిన్‌కార్ప్‌ కంపెనీలు ఎందుకు విశాఖ నుంచి పారిపోయాయి?

సరైన ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి పడిపోయిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తారా?

మీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు మిన్నకుండి ఆఖరి ఏడాదిలో ఈ సదస్సు పెట్టడంలో ఆంత్యరం ఏమిటి?

Updated Date - 2023-03-02T21:42:47+05:30 IST