Ganta Srinivasa Rao: జగన్‌కు గంటా శ్రీనివాసరావు సెల్ఫీ ఛాలెంజ్
ABN , First Publish Date - 2023-04-21T16:35:22+05:30 IST
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వానికి (Jagan Govt) టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. విశాఖలో ఏయూ కన్వెన్షన్ సెంటర్, ఉడా చిల్డ్రన్స్ ఎరీనా, టీయు 142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం తాము నిర్మించామని, తమ పాలనలో మరెన్నో నిర్మించామని... ఇవన్నీ సజీవ సాక్ష్యాలని గంటా తెలిపారు. నిర్మాణాల వద్ద నిలబడి గంటా శ్రీనివాసరావు సెల్ఫీ చాలెంజ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో తమరు విశాఖలో నిర్మించిన ఒక చిన్న రేకుల షెడ్డు చూపించగలరా అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy), మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు (Palla Srinivasarao) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మండుటెండలో సైతం లోకేష్ పాదయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఇప్పటికే 1/4 పూర్తయిందన్నారు. పాదయాత్రలో లోకేష్ పరిపూర్ణమైన నాయకుడిగా రూపు దిద్దుకుంటున్నారని కొనియాడారు.
జగన్ ప్రభుత్వాన్ని (Jagan Govt.) కౌంట్ డౌన్ స్టార్ట్ (Countdown Start) అయిందని.. 356 రోజులు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇక రోజులు లెక్క పెట్టుకోవడమే తరువాయి అని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి.. లోపాయి కారీగా స్వప్రయోజనాల కోసం మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. విశాఖలో పేర్లు మార్పిడి పరంపర, కొనసాగుతోందన్నారు. సీత కొండ వ్యూ పాయింట్‌కు, వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చడం సరైనది కాదన్నారు. ఆ ప్రాంత మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని, అవసరమైతే జాతి నాయకుల పేర్లు పెట్టాలని కోరుతున్నామన్నామని గంటా శ్రీనివాసరావు అన్నారు.
బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ అందరి ఆశీస్సులు లోకేష్‌కు ఉండాలని కోరుతున్నానన్నారు. చేసిన అభివృద్ధిపై సెల్ఫీ చాలెంజ్ పెడుతున్నారని, బాబాయి వివేకా హత్య ఉదంతం, బయటపడుతుందని సీఎం జగన్ లండన్ టూర్ రద్దు చేసుకున్నారని అన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి జైళ్లలో ఏం అవసరమైతే అవి ఇప్పుడే మరమ్మతులు చేయించుకుంటే మంచిదని బండారు సత్యనారాయణ మూర్తి సూచించారు.