Farmer family: న్యాయం కోసం వైసీపీ సానుభూతి కుటుంబం ఆందోళన

ABN , First Publish Date - 2023-02-28T13:15:07+05:30 IST

న్యాయం చేయాలంటూ ఓ రైతు కుటుంబం పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టింది. దాచేపల్లి మండలం తంగెడ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతు కుటుంబం బైఠాయించింది

Farmer family: న్యాయం కోసం వైసీపీ సానుభూతి కుటుంబం ఆందోళన
వైసీపీ సానుభూతి కుటుంబం ఆందోళన

పల్నాడు: న్యాయం చేయాలంటూ ఓ రైతు కుటుంబం పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టింది. దాచేపల్లి మండలం తంగెడ భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతు కుటుంబం బైఠాయించింది. తమ పొలాలకు వెళ్లే దారి భవ్య ఫ్యాక్టరీ వాళ్లు ఆక్రమించారని ఆరోపించారు. తమ కుటుంబం వైసీపీ గెలుపు కోసం ఎంతో కృషి చేసిందని తెలిపారు. కబ్జాకు గురైన పొలం సమస్యపై గురజాల ఎమ్మెల్యేను కలిసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కనీసం తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాసు-భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి తొత్తుగా మారారని ఆరోపించారు. అలాగే తాడేపల్లి పెద్దల దగ్గరకు కూడా తన పొలం సమస్య తీసుకువెళ్లినట్లు తెలిపారు. తమకు న్యాయం జరగకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చేస్తామని రైతు కుటుంబం హెచ్చరించింది.

Updated Date - 2023-02-28T13:15:07+05:30 IST