Andhra Pradesh: ఏపీలో భారీగా ఐపీఎస్‎ల బదిలీ

ABN , First Publish Date - 2023-04-08T08:48:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ బదిలీ అయ్యాయి. 39 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Andhra Pradesh: ఏపీలో భారీగా ఐపీఎస్‎ల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ బదిలీ జరిగింది. 39 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరిగాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మళ్లీ రెండు జీవోలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఏలూరు రేంజ్ డీఐజీ- GVG అశోక్‌కుమార్‌, గుంటూరు రేంజ్ ఐజీ-G పాలరాజు, అనంతపురం రేంజ్‌ డీఐజీ -RN అమ్మిరెడ్డి, సెబ్ డీఐజీ-M రవిప్రకాష్‌, APSP డీఐజీ- B రాజకుమారి, DGP ఆఫీస్‌ అడ్మిన్‌ డీఐజీ-సర్వశ్రేష్ట త్రిపాఠి, గ్రేహౌండ్స్‌ డీఐజీ-కోయ ప్రవీణ్‌, లా అండ్ ఆర్డర్‌ అడిషనల్ డీజీ-శంకబ్రత బాగ్చి, CID ఐజీ-సీహెచ్ శ్రీకాంత్‌, విశాఖపట్నం సిటీ కమిషనర్-త్రివిక్రమ్ వర్మ, విశాఖ లా అండ్‌ ఆర్డర్ డీసీపీ- వాసన్ విద్యాసాగర్ నాయుడు, SIB ఎస్పీ- సుమిత్ సునీల్‌, 16వ బెటాలియన్ APSP విశాఖ కమాండెంట్-గౌతమి సాలి, 5వ బెటాలియన్ APSP విజయనగరం కమాండెంట్- రాహుల్‌దేవ్ శర్మ, 3వ బెటాలియన్ APSP కాకినాడ కమాండెంట్‌-CH విజయరావు, CID ఎస్పీ- V హర్షవర్ధన్ రాజు, CID ఎస్పీ-ఫకీరప్ప, విజయవాడ రైల్వే ఎస్పీ- రాహుల్‌దేవ్ సింగ్, అక్టోపస్ ఎస్పీ-సిద్ధార్థ కౌశల్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-04-08T09:01:04+05:30 IST