AP News: కోవిడ్ కేసులు.. ఏపీ వైద్యశాఖ అప్రమత్తం

ABN , First Publish Date - 2023-04-10T19:03:21+05:30 IST

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ (AP) వైద్యశాఖ అప్రమత్తమైంది.

AP News: కోవిడ్ కేసులు.. ఏపీ వైద్యశాఖ అప్రమత్తం

విజయవాడ: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ (AP) వైద్యశాఖ అప్రమత్తమైంది. విజయవాడ (Vijayawada) ప్రభుత్వసుపత్రిలో అధికారులు కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కోవిడ్ మాక్ డ్రిల్‌లో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, డిఎంఅండ్ హెచ్ఒ సుహాసిని, ప్రభుత్వసుపత్రి సూపరిండెంట్ సౌభాగ్య లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. కోవిడ్ కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒమిక్రాన్ బిఎఫ్ 7 వైరస్‌తో ఎటువంటి ప్రమాదకర లక్షణాలు లేవన్నారు. ఫోర్త్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు. డాక్టర్లు, మందులు వంటివి కోరత లేకుండా అన్ని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. 951 బెడ్లు సిద్దం చేశామని, ఇప్పటికే 6 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

Updated Date - 2023-04-10T19:03:21+05:30 IST