Chandrababu: పవన్‌కు ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది.. జగన్ ప్రభుత్వ పతనం తప్పదు
ABN , First Publish Date - 2023-01-13T20:36:14+05:30 IST
జనసేన అధినే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తెలిపారు.
తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తెలిపారు. పవన్‌కు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందని, ఎందుకు ఇంతమంది రియాక్ట్ అవుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, ఎదురుదాడులతో వైసీపీ నేతలు తమ పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. విధ్వంసానికి, దాని ప్రచారానికి రూ.కోట్లు ఖర్చు పెడుతున్న జగన్ ప్రభుత్వం, ప్రజల అవసరాలు తీర్చకుండా భయపెట్టాలని చూస్తే పతనం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జీవో 1పై పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు.