AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన జగన్ సర్కార్
ABN , First Publish Date - 2023-07-18T15:23:41+05:30 IST
జగన్ ప్రభుత్వం మరోసారి వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రుణం తెచ్చింది.
అమరావతి: జగన్ ప్రభుత్వం (Jagan Government) మరోసారి వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రుణం తెచ్చింది. ఈ వెయ్యి కోట్లతో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. 90 రోజుల్లో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పుతో ఏపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది ఎఫ్ఆర్బీఎం కింద కేంద్రం ఏపీకి 30 వేల 500 కోట్లే అనుమతి ఇచ్చింది. ఇందులో ఇక మిగిలింది 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.