Nadendla Manohar: వారాహి యాత్ర చరిత్రలోనే అద్భుతమైన యాత్ర

ABN , First Publish Date - 2023-07-03T13:10:45+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో ఊహించిన దాని కన్నా విజయవంతం అయ్యిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.

Nadendla Manohar: వారాహి యాత్ర చరిత్రలోనే అద్భుతమైన యాత్ర

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Nadendla Manohar) చేపట్టిన వారాహి యాత్ర (Varahi Yatra) గోదావరి జిల్లాల్లో ఊహించిన దాని కన్నా విజయవంతం అయ్యిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Janasena Leader Nadendla Manohar) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వారాహి యాత్ర చరిత్రలోనే అద్భుతమైన యాత్ర అని పేర్కొన్నారు. జనసేనతో కలిసి నడవాలని ప్రజల్లో స్పష్టత కనపడుతోందన్నారు. యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి సమాచారం సేకరించారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏమి చేసేది స్పష్టంగా ప్రజలకు వివరించారన్నారు. సంస్కారం లేని మనుషులు పాలన చేస్తే రాష్ట్రం ఇలానే ఉంటుందని విమర్శించారు. మీలోనే స్పందన లేనప్పుడు స్పందన కార్యక్రమాలు ఎందుకు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న ప్రజలపై, నాయకులపై వందల సంఖ్యలో కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై వైసీపీలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఎందుకు దూషణలకు దిగుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ద్వారా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పారు. రెండో విడత వారాహి యాత్ర పశ్చిమ గోదావరిలోనే కొనసాగిస్తామని తెలిపారు. రెండో విడత యాత్ర త్వరలోనే ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Updated Date - 2023-07-03T13:10:45+05:30 IST