Nara Lokesh: మంగళగిరి కోర్టులో నారా లోకేష్ వాంగ్మూలం..

ABN , First Publish Date - 2023-07-14T11:49:54+05:30 IST

గుంటూరు జిల్లా: వైసీపీ అసత్య ప్రచారంపై టీడీపీ యువనేత నారా లోకేష్ న్యాయపోరాటం ప్రారంభించారు. ఏపీ అటవీ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీసీ ఎమ్మెల్సీ పోతుల సునీతపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు.

Nara Lokesh: మంగళగిరి కోర్టులో నారా లోకేష్ వాంగ్మూలం..

గుంటూరు జిల్లా: వైసీపీ (YCP) అసత్య ప్రచారంపై టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) న్యాయపోరాటం ప్రారంభించారు. ఏపీ అటవీ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి (Devendar Reddy), వైసీసీ ఎమ్మెల్సీ పోతుల సునీత (Potula Sunita)పై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. న్యాయపోరాటం కోసం యువగళం పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులపై అసత్య ఆరోపణలు ప్రసారం చేస్తున్న వైసీపీ నేతల వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకోవాలని లోకేష్ నిర్ణయించారు. ఇప్పటికే సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేసిన లోకేష్.. వైసీపీ నేతలు సోషల్ మీడియా బాధ్యులు కూడా తనను టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేయడంపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతపై మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో లోకేష్ క్రిమినల్ కేసులు దాఖలు చేశారు.

లోకేశ్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహ‌త్యపై వైసీపీ సోష‌ల్ మీడియా కోఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి లోకేశ్‌పై దుష్ప్రచారం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి భూమి వివాదమే కారణం అంటూ త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా విష‌ప్రచారం చేశారు. అలాగే భువనేశ్వరి, బ్రహ్మణీలపై ఎమ్మెల్సీ సునీత దారుణమైన వ్యాఖ్యలు చేశారని లోకేష్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. కాగా శుక్రవారం లోకేష్ కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-07-14T11:49:54+05:30 IST