Minister Darmana: ఏమీ చేయలేని ప్రభుత్వాలకు సమస్యలు కనిపించవు..

ABN , First Publish Date - 2023-02-15T15:52:47+05:30 IST

గుంటూరు జిల్లా: జగనన్న ఇళ్ళు నిర్మాణంలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని మంత్రి దర్మాన ప్రసాదరావు అన్నారు.

Minister Darmana: ఏమీ చేయలేని ప్రభుత్వాలకు సమస్యలు కనిపించవు..

గుంటూరు జిల్లా: జగనన్న (Jagananna) ఇళ్ళు నిర్మాణం (Houses Construction)లో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని మంత్రి దర్మాన ప్రసాదరావు (Minister Darmana Prasadarao) అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్ష మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మాట్లాడుతూ ఏమీ చేయలేని ప్రభుత్వాలకు సమస్యలు కనిపించవని అన్నారు. 1956లో జరిగిన భూ సర్వే (vLand Survey) తర్వాత ఇంతవరకు సర్వేలు చేయలేదని, సర్వే జరగనందువల్ల గ్రామాల్లో గొడవలకు దారి తీస్తుందన్నారు.

రాష్ట్రంలో డిసెంబర్ నాటికల్లా సర్వేలు పూర్తి చేస్తామని, అనుభవం ఉన్న సిబ్బందిని నియమించామని మంత్రి ధర్మాన తెలిపారు. అత్యాధునిక డ్రోన్‌లు ద్వారా సర్వేలు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో నేటికీ 21 శాతం నిరక్షరాస్యత ఉందన్నారు. ఓట్లు కోసం సర్వే చేయటంలేదని.. ప్రజా ప్రయోజనాల కోసమే చేస్తున్నామని చెప్పారు. ఎల్‌కేజీ (LKG) నుంచి ఉన్నత విద్య వరకు మంచి విద్యను అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

గుంటూరు కాలువ ఆధునికీకరణ కోసం సీఎం జగన్ (CM Jagan) అంగీకారం తెలిపారని మంత్రి ధర్మాన తెలిపారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ మెరుగవ్వాలని.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఒక చట్టం చేసిందన్నారు. శివరామకృష్ణ కమిటి కూడా సూచనలు చేసిందని.. దీంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన చట్టం, కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారని, ముఖ్యమంత్రి చెప్పిన దానికి ప్రజలు ఆమోదం తెలిపారని మంత్రి దర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-15T15:52:51+05:30 IST