Share News

AP Minister: వృద్ధుడిపై మంత్రి మేరుగ నాగార్జున కండకావరం

ABN , First Publish Date - 2023-10-30T13:50:57+05:30 IST

ఓ వృద్ధుడిపై మంత్రి మేరుగు నాగార్జున కండకావరం చూపించారు.

AP Minister: వృద్ధుడిపై మంత్రి మేరుగ నాగార్జున కండకావరం

బాపట్ల: ఓ వృద్ధుడిపై మంత్రి మేరుగు నాగార్జున (Minister Meruga Nagarjuna) కండకావరం చూపించారు. సైడ్ కాలవలు లేవని, మురుగు నీటితో దుర్గంధం వస్తోందని వృద్ధుడు మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఎలాంటి సమాధానం చెప్పకపోవగా.. వృద్ధుడి పట్ల మంత్రి దురుసుగా ప్రవర్తించారు. వృద్ధుడిని నెట్టి పడేసి ముందుకు వెళ్లి పోయారు. ఆపై మంత్రి అనుచరులు కూడా మరింత రెచ్చిపోయారు. వృద్ధుడిపై పచ్చి బూతులతో దాడికి యత్నించారు. జిల్లాలోని చుండూరు మండలం దుండిపాలెంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి తీరు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-30T13:51:10+05:30 IST