NTR Dist.: 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి..

ABN , First Publish Date - 2023-08-20T11:14:41+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా: విస్సన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారు. కన్నతల్లి అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లి మరణం తట్టుకోలేక కొడుకు గుండెపోటుతో మరణించాడు.

NTR Dist.: 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి..

ఎన్టీఆర్ జిల్లా: విస్సన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారు. కన్నతల్లి అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లి మరణం తట్టుకోలేక కొడుకు గుండెపోటుతో మరణించాడు. దీంతో విస్సన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉదయం తల్లి ఆసుపత్రిలో మృతి చెందగా.. శనివారం సాయంత్రం తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఇంట్లో గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళితే..

విస్సన్నపేట గ్రామం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చంటి టైలర్‌గా గుడ్డల వీరబాబుకు మంచి పేరుంది. తల్లి అనారోగ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాతృమూర్తి మరణ వార్త విన్న వీరబాబు ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కన్నతల్లి మరణించిన 24 గంటలలోనే (శనివారం సాయంత్రం) వీరబాబు గుండెపోటుతో మరణించాడు. 24 గంటల వ్యవధిలో తల్లి, కుమారుడు మరణించడంతో కుటంబ సభ్యులు, విస్సన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-08-20T11:14:41+05:30 IST