Nadendla Manohar: మేయర్ కావటి మనోహర్ కావాలనే రెచ్చగొట్టారు

ABN , First Publish Date - 2023-09-12T14:55:55+05:30 IST

గుంటూరు జిల్లా: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన బంద్‌లో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారని, బాధ్యతగల ప్రజా ప్రతినిధి గుంటూరు మేయర్ కావటి మనోహర్ కావాలనే రెచ్చగొట్టారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

Nadendla Manohar: మేయర్ కావటి మనోహర్ కావాలనే రెచ్చగొట్టారు

గుంటూరు జిల్లా: చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన బంద్‌లో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారని, బాధ్యతగల ప్రజా ప్రతినిధి గుంటూరు మేయర్ కావటి మనోహర్ (Mayor Kavati Manohar) కావాలనే రెచ్చగొట్టారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మేయర్ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, రూల్ ఆఫ్ లా (Rule of Law) అందరికీ సమానమని అన్నారు. రాజకీయ లబ్ది కోసం కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారని, జనసేన (Janasena) ఎప్పుడు కూడా హింసలో పాల్గొనదని చెప్పారు. మేయర్ వాఖ్యలు వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించానన్నారు. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. మరోసారి వ్యాఖ్యలు చేసి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

జనసేన కార్యకర్తలను అక్రమంగా పోలీసులు నిర్బంధించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సూమోటోగా కేసులు పెట్టామని సుప్రీం కోర్టు చెప్పిన విషయా్ని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మేయర్ అన్న మాటలు ఆయన కుటుంబ సభ్యులైన హర్షిస్తారా? అని ప్రశ్నించారు. ఇంతమంది పోలీసులు ఎందుకు ఆయనకు భద్రత కల్పిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ధైర్యం లేక కాదని సహనం కోల్పోకూడదని ఆలోచిస్తున్నామన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వెంటనే కేసు నమోదు చేయాలని, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుందన్నారు. ఇరు పక్షాలపై కేసులు పెడతామని చెప్పడం దురదృష్టకరం. శాంతిభద్రతల సమస్య సృష్టించిందెవరు?.. తేల్చుకుందాం అంటారు.. ఏం తేల్చుకుంటారో చెప్పాలన్నారు. కుట్ర, కుళ్ళు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో ఇసుక రీచ్‌ల తవ్వకాలపై కూడా ఈడీ దర్యాప్తును కోరతామని,153ఏ, 153బి కింద కేసు నమోదు చేయాలని ఎస్పీకి చెబుతామని, లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-12T14:55:55+05:30 IST