Nakka Anandababu: దళిత ఎమ్మెల్యేలపై సీఎం జగన్ కక్ష...
ABN , First Publish Date - 2023-03-20T12:22:21+05:30 IST
అమరావతి: శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anandababu) ఖండించారు.
అమరావతి: శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anandababu) ఖండించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ (Assembly)లో దాడి ఎప్పుడూ జరగలేదని అన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోయే సరికి వైకాపా ప్రస్టేషన్‌లో ఉందన్నారు. దళిత ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) కక్ష పెంచుకున్నారని, గతంలో కూడా టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి (Dola Veeranjaneya Swamy)పై మంత్రి మేరుగ నాగార్జున (Meruga Nagarjuna) నీచంగా మాట్లాడారని అన్నారు.
ఇప్పడు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) టీజేఆర్ సుధాకర్ బాబుతో అసెంబ్లీలో ఎమ్మెల్యే స్వామిపై దాడి చేయించారని నక్కా ఆనందబాబు అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేలపై దాడికి సీఎం జగన్ రెడ్డి సిగ్గు పడాలన్నారు. వైసీపీ పని అయిపోయిందని, అందుకే సహానం కోల్పోతున్నారన్నారు. దాడి చేసిన వారు భవిష్యత్తులో అంతకు అంత అనుభవిస్తారని... ఎవ్వరిని వదిలి పెట్టమని నక్కా ఆనందబాబు హెచ్చరించారు.
కాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) టీజేఆర్ సుధాకర్ బాబు (Sudhakar Babu) దాడి చేసి.. స్పీకర్ పొడియం కిందకు నెట్టివేశారు. దీంతో స్పీకర్ పోడియం మెట్ల వద్ద ఎమ్మెల్యె స్వామి కిందపడిపోయారు. అలాగే మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampally Srinivas) టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chaudhary) దగ్గర ప్లకార్డ్ లాక్కోని నేట్టేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కింద కూర్చోని నిరసన చేపట్టారు. జీవో నంబర్1రద్దు చేయాలంటు టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను ముట్టడించారు. దీంతో స్పీకర్ చైర్ దగ్గరకు వెళ్తారా అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారు.