Pattabhi Ram: వివేకా హత్యకేసు సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటే.. పాత్రదారులు..

ABN , First Publish Date - 2023-02-12T20:59:19+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGANMOHANREDDY)పై టీడీపీ (TDP) నేత పట్టాభిరామ్ (Pattabhi Ram) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pattabhi Ram: వివేకా హత్యకేసు సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటే.. పాత్రదారులు..

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGANMOHANREDDY)పై టీడీపీ (TDP) నేత పట్టాభిరామ్ (Pattabhi Ram) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య (Vivekananda Reddy murder case)పై ఆధారాలతో జగనాసుర రక్తచరిత్ర పుస్తకం ద్వారా జగన్ క్రూరత్వాన్ని ప్రజలకు తెలియజేశామని పట్టాభిరామ్ అన్నారు. అందుకే నిన్నటి నుంచి తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోందని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటే ప్రధాన పాత్రదారులు ఎంపీ అవినాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఉన్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి సీబీఐకి ముఖం ఎందుకు చాటేశారు? అని ప్రశ్నించారు. సీఐ శంకరయ్యపై ఒత్తిడి తెచ్చి అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ రాయించింది అవినాష్‌రెడ్డి కాదా? పట్టాభిరామ్ అన్నారు. వివేకా హత్యకేసులో జగన్ తీరు గమనించే సీబీఐ విచారణ కోరుతూ సునీత హైకోర్టును ఆశ్రయించారని పట్టాభిరామ్ తెలిపారు. తప్పుడు రాతలు, అబద్దాలతో ఇంకా ప్రజలను మోసం చేయాలనుకోవడం దివాళాకోరుతనమని పట్టాభిరామ్ మండిపడ్డారు.

2019 ఎన్నికలకు ముందు మార్చి 15 అర్ధరాత్రి తరువాత వివేకా తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేమిటి? హత్యకు పథక రచన చేసిందెవరు? హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు.. ఎలా హత్య చేశారు? హత్య అనంతరం కేసును తప్పుదారి పట్టించేందుకు ఎలాంటి బలవంతపు తప్పుడు ఆధారాలు సృష్టించారు వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పినట్లుగా ఈ పత్రాల్లో ఉంది.

అసలు తాను వివేకానందరెడ్డి వద్ద ఎలా చేరానన్నదీ దస్తగిరి వివరించారు. ''పులివెందులలో గత 15 ఏళ్లుగా మేం నివాసం ఉంటున్నాం. మా మామ షేక్ రసూల్ 2016 డిసెంబరులో తనను వైఎస్ వివేకానందరెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. ఆ తరువాత 2017 ఫిబ్రవరి నుంచి 2018 డిసెంబరు వరకు నేను వివేకా వద్ద డ్రైవరుగా పనిచేశాను. అదే సమయంలో తనకు వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డితో పరిచయమైంది. వివేకా ఎక్కడకి వెళ్లినా గంగిరెడ్డి ఆయనతో పాటు ఉండేవారు.

గంగిరెడ్డితో పాటు యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఆయన సోదరుడు గజ్జల జగదీశ్వర్ రెడ్డిలతోనూ పరిచయమైంది. తాను వివేకా దగ్గర డ్రైవరుగా పని మానేసిన తరువాత కూడా వీరితో పరిచయం కొనసాగింది. తరచూ ఫోన్లో మాట్లాడడం, కలుసుకోవడం చేసేవాళ్లం'' అని దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పారు.

Updated Date - 2023-02-12T21:02:14+05:30 IST