Share News

AP News: ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణ తీరుపై క్రీడా సంఘాల ఆగ్రహం

ABN , Publish Date - Dec 27 , 2023 | 10:33 AM

Andhrapradesh: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్ర’’ కార్యక్రమం నిర్వహణ తీరుపై క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ పాలనలో క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు.

AP News: ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణ తీరుపై క్రీడా సంఘాల ఆగ్రహం

గుంటూరు: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్ర’’ కార్యక్రమం నిర్వహణ తీరుపై క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ పాలనలో క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. గతంలో లేని పే అండ్ ప్లే విధానాన్ని తెచ్చి క్రీడలకు విద్యార్థులను దూరం చేశారని ఫుడ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమ్మరి క్రాంతి కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క స్టేడియం నిర్మాణం చేసే ఆలోచన జగన్‌కు రాలేదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు లేరన్న విషయం సీఎంకు తెలుసన్నారు. ప్రభుత్వ స్టేడియాలను మరుగున పెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో క్రీడల నిర్వాహణ సిగ్గు చేటని విమర్శించారు. విద్యార్థులకు బీపీ, షుగర్‌లు రావన్న విషయాన్ని సీఎం తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు ఓట్లు లేకపోవడం వల్లే క్రీడలను జగన్ నిర్లక్ష్యం చేశారని ఆగ్రహించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఆడుదాం ఆంధ్ర అని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంలో క్రీడా రంగం బడ్జెట్ ఎంతో సీఎం జగన్ రెడ్డికి తెలుసా అని కుమ్మరి క్రాంతి కుమార్ ప్రశ్నించారు.

Updated Date - Dec 27 , 2023 | 10:33 AM