Share News

AP NEWS: ఏపీలో ప్రహసనంగా సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్ఏ)-1 పరీక్షలు

ABN , First Publish Date - 2023-12-02T19:56:41+05:30 IST

ఏపీలో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్ఏ)-1 పరీక్షలు ( Summative Assessment (SA)-1 exams ) ప్రహసనంగా మారాయి. పరీక్షల ప్రశ్నాపత్రాలు ఒకటి రెండు రోజులు ముందే యూట్యూబ్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. వరుసగా పేరర్లు యూట్యూబ్‌లో బయటకు వస్తున్నా కళ్లు మూసుకొని పాఠశాల విద్యాశాఖ తమకు తెలియదంటు బుకాయిస్తున్నాయి.

AP NEWS: ఏపీలో ప్రహసనంగా సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్ఏ)-1  పరీక్షలు

అమరావతి: ఏపీలో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్ఏ)-1 పరీక్షలు ( Summative Assessment (SA)-1 exams ) ప్రహసనంగా మారాయి. పరీక్షల ప్రశ్నాపత్రాలు ఒకటి రెండు రోజులు ముందే యూట్యూబ్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. వరుసగా పేరర్లు యూట్యూబ్‌లో బయటకు వస్తున్నా కళ్లు మూసుకొని పాఠశాల విద్యాశాఖ తమకు తెలియదంటు బుకాయిస్తున్నాయి. నేడు జరిగిన 9వ తరగతి అసెస్‌మెంట్(ఎస్ఏ)-1 పరీక్షాపత్రం మూడు రోజుల కిందటే యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయింది. సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్ఏ)-1 పరీక్ష ప్రత్రాల కోసం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఫీజలు సైతం చెల్లిస్తున్నారు. పేపర్ ముందే య్యూట్యూబ్‌లో లీక్ అవుతుండడంపై రాష్ట్ర వ్యప్తంగా విద్యార్థులు చర్చించుకుంటున్నారు. దీనికితోడు నేడు జరిగిన 9 వ తరగతి ఇంగ్లీష్ పేపర్‌లో వింత ప్రశ్న విద్యార్థులకు ఎదురైంది. విద్యార్థులకు స్టోరీ రైటింగ్ విభాగంలో ఓ న్యూస్ పేపర్ రిపోర్టు రాయాలంటూ ప్రశ్న అడిగారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొనడంపై న్యూస్ రిపోర్టు రాయాలంటూ ప్రశ్న అడిగారు. పిల్లల ప్రశ్నాపత్రాలలో రాజకీయాలేంటని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-12-02T20:02:51+05:30 IST