YuvaGalam: గురజాలలో దుమ్మురేపుతోన్న లోకేశ్ యువగళం...

ABN , First Publish Date - 2023-08-08T10:47:56+05:30 IST

గురజాల నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర దుమ్మురేపుతోంది. మంగళవారం ఉదయం జూలకల్లు నుంచి 178వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు.

YuvaGalam: గురజాలలో దుమ్మురేపుతోన్న లోకేశ్ యువగళం...

పల్నాడు: గురజాల నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేశ్‌ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) దుమ్మురేపుతోంది. మంగళవారం ఉదయం జూలకల్లు నుంచి 178వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని (Former MLA Yarapatineni) నేతృత్వంలో పాదయాత్ర హోరెత్తుతోంది. గురుజాల నియోజకవర్గంలో రకారకాల కళాకారులతో లోకేశ్‌‌కు స్వాగతం పలికారు. 101 కలశాలతో మహిళలు లోకేశ్‌ను స్వాగతించారు. అలాగే వేదపండితులు ఆశీర్వచనం అందించారు. సాంప్రదాయ డప్పులు, థిండ్సా నృత్యాలు, కేరళ వాయిద్యాలు, ఒంటెలు, అశ్వాలతో యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, పార్టీ కార్యకర్తల కేరింతల నడుమ పాదయాత్ర కొనసాగుతోంది. దారిపొడవునా లోకేశ్‌కు మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. ధరల పెరుగుదల, అరాచకపాలనతో అవస్థలు పడుతున్నామని యువనేతకు గురజాల ప్రజల ఆవేదన వెలిబుచ్చారు. మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు.

Updated Date - 2023-08-08T10:47:56+05:30 IST