MLA Sucharitha: ఎమ్మెల్యే సుచరితను అడ్డుకున్న మహిళలు
ABN , First Publish Date - 2023-12-07T16:41:03+05:30 IST
Andhrapradesh: ఎమ్మెల్యే సుచరితను మహిళలు అడ్డుకున్నారు. గురువారం కాకుమాను వరద ప్రాంతాలను పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే కారును కాకుమాను ఎస్సీ కాలనీ మహిళలు అడ్డుకున్నారు. ఇళ్లలోకి నీరు వచ్చిందని కనీసం పట్టించుకున్న వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే సుచరితను (MLA Sucharitha) మహిళలు అడ్డుకున్నారు. గురువారం కాకుమాను వరద ప్రాంతాలను పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే కారును కాకుమాను ఎస్సీ కాలనీ మహిళలు అడ్డుకున్నారు. ఇళ్లలోకి నీరు వచ్చిందని కనీసం పట్టించుకున్న వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి స్థలాలు ఇవ్వలేదని, రహదారులు నిర్మించలేదని మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. స్థానిక వైసీపీ నేతలు, అధికారులు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా చెప్పలేదని మహిళలు ఆగ్రహించారు. ప్రతి వీధిలో ఎమ్మెల్యేకు మహిళలు సమస్యలను ఏకరువు పెట్టారు. అన్ని ఏర్పాటు చేపిస్తామని మహిళలకు చెప్పి ఎమ్మెల్యే సుచరిత అక్కడి నుంచి వెళ్లిపోయారు.