Yarapatineni.. ఏపీలో అగోమ్య గోచరంగా రైతుల పరిస్థితి: యరపతినేని
ABN , First Publish Date - 2023-10-12T15:13:28+05:30 IST
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం పరిస్థితి అగోమ్య గోచరంగా ఉందని, కృష్ణ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం పరిస్థితి అగోమ్య గోచరంగా ఉందని, కృష్ణ జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasarao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం పల్నాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ (CM Jagan) తన ఆస్తులను రక్షించుకోవడానికి తెలంగాణ (Telangana)కు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్టాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీరు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని, పిన్నెల్లి గ్రామంలో బూతులు సచివాలయంలోకి మార్చారని ఆరోపించారు. టీడీపీ నాయకులు రాకుండా రిగ్గింగ్ చేయాలని ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఈరోజు రాష్ట్రంలో ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదని, ర్యాలీ చేసినా, ప్రశ్నించినా కేసులు నమోదు చేస్తున్నారని యరపతినేని మండిపడ్డారు. జగన్ జైలు జీవితం అనుభవించారు కాబట్టి చంద్రబాబు (Chandrababu)ను కూడా జైలుకు పంపాలని ఆలోచన తప్ప ఏమి లేదన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని, సాక్షి టీవీ, చానల్‌కు కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో ప్రభుత్వం ధనం దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. అడుగడుగున టీడీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలన్నారు.
తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడే ప్రసేక్తేలేదని యరపతినేని అన్నారు. పల్నాడులో విచ్చలవిడిగా మైనింగ్ మాఫియా జరుగుతోందన్నారు. ప్రైవేటు భూములు కుడా వదలకుండా కబ్జా చేస్తున్నారని, వ్యవస్థలు అన్ని సర్వం నాశనం చేశారని విమర్శించారు. టీడీపీ వారిపై దాడి చేసి మరలా వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పిడుగురాళ్ల బైపాస్ ఇంతవరకు పూర్తి చేయలేదని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.