Rain: తిరుమలలో భారీ వర్షం
ABN , First Publish Date - 2023-05-30T19:45:02+05:30 IST
తిరుమల పుణ్యక్షేత్రంలో శనివారం భారీ వర్షం (Heavy Rain) కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎండ తీవ్రంగానే ఉన్నప్పటికీ ఒంటి గంట నుంచి నల్లటి మేఘాలు తిరుమల (Tirumala)ను కప్పేశాయి.
తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో శనివారం భారీ వర్షం (Heavy Rain) కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎండ తీవ్రంగానే ఉన్నప్పటికీ ఒంటి గంట నుంచి నల్లటి మేఘాలు తిరుమల (Tirumala)ను కప్పేశాయి. తిరుమలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 1 గంటకు మొదలై 30 నిమిషాల పాటు ఎడతెరిపిలేకుండా కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, బస్టాండ్, రోడ్డు, కాటేజీలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతోపాటు దర్శనం తర్వాత వెలుపలకు వచ్చే భక్తులు వర్షంతో తడుస్తూ వెళ్లారు. కొంతమంది వర్షం నిలిచేవరకు షెడ్ల కింద సేదతీరారు. రోడ్లు కూడా జలమయమయ్యాయి. ఘాట్లలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం నుంచి కొండపై చలితీవ్రత పెరిగింది.