yuvagalam Padayatra: చంద్రబాబును గెలిపించి ఉంటే పోలవరం పూర్తి అయ్యేది: లోకేష్
ABN , First Publish Date - 2023-03-02T17:41:58+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను గెలిపించి ఉంటే పోలవరం (Polavaram) పూర్తి అయ్యేదని, గ్రావిటీ ద్వారా రాయలసీమ నీళ్లు వచ్చేవని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను గెలిపించి ఉంటే పోలవరం (Polavaram) పూర్తి అయ్యేదని, గ్రావిటీ ద్వారా రాయలసీమ నీళ్లు వచ్చేవని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. టీడీపీ హయాంలో హంద్రీనీవా పనులు 90% పూర్తి చేసినా.. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. కొండేపల్లి క్రాస్ దగ్గర మామిడి రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రూ.లక్ష కోట్లు దోచుకుని 16 నెలలు జైల్లో ఉన్న మోసగాడు.. ఎప్పుడూ మోసమే చేస్తాడు. దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే దళితుల భూములు తిరిగి ఇప్పిస్తాం. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో జాప్యం చేస్తున్నారు. డీకేటి భూములపై హక్కు కల్పించేలా చట్టం తీసుకువస్తాం. ఇరిగేషన్, వ్యవసాయశాఖ మంత్రులకు సమస్యలు పట్టవు’’ అని లోకేష్ ధ్వజమెత్తారు.