AP News: టీడీపీ-జనసేన కలిస్తే జగన్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదు: బోండా ఉమ
ABN , First Publish Date - 2023-05-14T16:01:30+05:30 IST
టీడీపీ-జనసేన (TDPJana Sena) కలిస్తే సీఎం జగన్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదని టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) జోస్యం చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (Inner Ring Road) లేదు..
అమరావతి: టీడీపీ-జనసేన (TDP Jana Sena) కలిస్తే సీఎం జగన్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదని టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) జోస్యం చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (Inner Ring Road) లేదు.. బొంగు రింగ్ రోడ్డు లేదని ఎద్దేవాచేశారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), మంత్రి నారాయణ ముద్దాయిలా? అని ప్రశ్నించారు. లింగమనేని పేరుపై ఇల్లుంటే.. చంద్రబాబుపై క్విడ్ ప్రోకో ఆరోపణలా అని నిలదీశారు. సీఎం జగన్ జారీ చేసిన అటాచ్‌మెంట్లు, జీవోలు నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవాచేశారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు. లేని మరకలను చంద్రబాబుకు అంటించాలనుకోవడం ఆకాశంపై ఉమ్మి వేయడమేనని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఏమైనా తప్పులు జరిగాయా అని శోధించారని, ఎలాంటి తప్పు జరగలేదని తెలిసి అక్కసుతో గెస్ట్‌హౌస్‌ను ఫ్రీజ్ చేశారని దుయ్యబట్టారు. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. తప్పుడు కేసుల నుంచి న్యాయవ్యవస్థే రక్షణ కల్పిస్తుందన్నారు. అవినాశ్ అరెస్ట్, తాడేపల్లి ప్యాలెస్ గుమ్మంలోకి సీబీఐ రాక ఖాయమని బోండా ఉమ జోస్యం చెప్పారు.