Home » Jana Sena
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
Andhrapradesh: విజయవాడ సింగ్‌నగర్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి ఘటనపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడి కత్తి డ్రామాతో జగన్ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు సింగ్ నగర్‌లో గులకరాయి దాడితో కొత్తనాటకానికి తెరలేపారంటూ విమర్శించారు. జగన్ పర్యటించిన ప్రదేశంలో వీధిలైట్లు కూడా లేనప్పుడు నిఘావర్గాలు ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఒక్క జగన్‌కే చీకట్లో గులకరాయి ఎలా తగిలింది? అంటూ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహించి డీజీపీ తక్షణమే విధుల్లోంచి తప్పుకోవాలన్నారు.
అయోధ్య రామ మందిర్(ram mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాలరాముడిని చూసి పులకించిపోయినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా భావోద్వేగంతో తన కళ్ల నుంచి నీరు వచ్చినట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు.
ఏపీలో పోలీసులు ఎందుకు ప్రతిపక్షాల కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారో తెలియజేస్తూ జనసేన కీలక నేత కిరణ్ రాయల్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఏపీలో పోలీసులు వైసీపీ నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోదని.. నిత్యావసర వస్తువుల వ్యవస్థ ఆగిపోదని తేల్చిచెప్పారు.
టీడీపీ-జనసేన (TDPJana Sena) కలిస్తే సీఎం జగన్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదని టీడీపీ నేత బోండా ఉమ (Bonda Uma) జోస్యం చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (Inner Ring Road) లేదు..