IRR Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN , First Publish Date - 2023-11-07T13:46:46+05:30 IST
ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటీషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల22కు వాయిదా వేసింది.
అమరావతి: ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో (IRR Alignment Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పిటిషన్‌పై విచారణను హైకోర్టు (AP Highcourt) ఈనెల 22కు వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. పీటీ వారెంట్‌పై ఒత్తిడి చేయబోమని ఏజీ చెప్పారు. గతంలో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.