Kollu Ravindra: బీసీలు బతకడానికి వీల్లేదన్నట్టుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు

ABN , First Publish Date - 2023-07-08T16:31:40+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శలు గుప్పించారు.

Kollu Ravindra: బీసీలు బతకడానికి వీల్లేదన్నట్టుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శలు గుప్పించారు.

''రాష్ట్రంలో బీసీలు బతకడానికి వీల్లేదన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. నిత్యం బీసీలపై దాడులు, వేధింపులు, ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నా జగన్ రెడ్డిలో చలనం లేదు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అధికారమదంతో బీసీలపై దాడిచేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. విజయవాడలో చేనేత కార్మికుడిపై దాడి చేసి, కొట్టి బట్టలూడదీసీ, ఆ దృశ్యాలను వీడియో తీసిన వైసీపీ నేత అవినాశ్ గుప్తా, అతని స్నేహితులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?.'' అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

'' జగన్ రెడ్డి హయాంలో నేతకార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఉపాధిలేక, అప్పులపాలై కుటుంబపోషణ భారమై 60 మంది చనిపోయారు. బీసీలను తప్పుడు కేసులతో హింసిస్తున్న పోలీస్ అధికారులు టీడీపీ ప్రభుత్వం రాగానే తగిన మూల్యం చెల్లించుకుంటారు. బీసీలపై జరిగే దాడులు, వేధింపులు, ఇతరత్రా దారుణాల్ని జగన్ తక్షణమే నిరోధించాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేవరకు బీసీలు నిద్రపోరు.'' అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Updated Date - 2023-07-08T16:32:04+05:30 IST