Jogi Ramesh : చంద్రబాబు కావాలనే జగనన్న కాలనీపై విమర్శలు చేస్తున్నారు
ABN , First Publish Date - 2023-04-18T14:10:39+05:30 IST
ఏలూరు రూరల్ పోణంగి జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను మంత్రి జోగి రమేష్, యంయల్ఏ ఆళ్ల నాని పరిశీలించారు. ఏలూరు కలెక్టరేట్‌లో జగనన్న ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు.
ఏలూరు : ఏలూరు రూరల్ పోణంగి జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను మంత్రి జోగి రమేష్, యంయల్ఏ ఆళ్ల నాని పరిశీలించారు. ఏలూరు కలెక్టరేట్‌లో జగనన్న ఇళ్ల నిర్మాణం పురోగతిపై అధికారులతో మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో అన్ని ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇవ్వడమే జగనన్న లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కావాలనే జగనన్న కాలనీలపై విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదుని జోగి రమేష్ విమర్శించారు.
అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పేరుతో డబ్బులు వసూలు చేశారన్నారు. టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారు. టిడ్కో లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామన్నారు.