Lokesh: మిషన్ రాయలసీమపై నారా లోకేష్ ఛాలెంజ్
ABN , First Publish Date - 2023-06-13T19:57:20+05:30 IST
మిషన్ రాయలసీమ (Rayalaseema)పై టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) ఛాలెంజ్ చేశారు.
కడప: మిషన్ రాయలసీమ (Rayalaseema)పై టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) ఛాలెంజ్ చేశారు. సీమలోని వైసీపీ (YCP) ఎమ్మెల్యేలు, ఎంపీలకు లోకేష్ ఛాలెంజ్ విసిరారు. ‘‘మీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రండి.. నేను ఒక్కడినే వస్తా, సీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు మేం సిద్ధం. బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా?. సీమకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిందేమీ లేదు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. గతంలో రాయలసీమను అభివృద్ధి చేసింది టీడీపీనే. అధికారంలోకి రాగానే ప్రతిహామీని నిలబెట్టుకుంటాం.’’ అని వ్యాఖ్యానించారు.