Avinash Reddy: మూడు గంటలకు విచారణకు రావాలన్న సీబీఐ.. ఇంతలోనే అవినాశ్ ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2023-05-16T14:10:35+05:30 IST
సీబీఐ విచారణకు రాలేనన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విజ్ఞప్తిని సీబీఐ అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే.
కడప: సీబీఐ విచారణకు రాలేనన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) విజ్ఞప్తిని సీబీఐ అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈరోజు 3 గంటల వరకు విచారణకు రావాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. అయితే సీబీఐ సమాధానం తర్వాత పులివెందులకు వెళ్లాలని అవినాశ్ ముందు భావించారు. కొద్దిగంటల వరకు హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే అవినాశ్ ఉన్నారు. అయితే తన విజ్ఞప్తిని సీబీఐ తిర్కరించినప్పటికీ పులివెందులకే వెళ్లాలని ఎంపీ నిర్ణయించారు. తన వాహనంలో పులివెందులకు బయలుదేరి వెళ్లారు. దీంతో ఎంపీ అవినాశ్ రెడ్డి వర్సెస్ సీబీఐ అన్నట్లుగా వాతావరణం మారిపోయింది. మరికాసేపట్లో పులివెందులలోని తన నివాసానికి అవినాశ్ చేరుకోనున్నారు. పులివెందులలో ఈరోజు జరగబోయే కార్యక్రమాలను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. సీబీఐ నిర్ణయాలను బట్టి పులివెందులలో అయినా అవినాశ్ అరెస్ట్ కావచ్చనే అనుమానాలతో వెసీపీలో టెన్షన్ మొదలైంది.